భారతదేశం, మార్చి 22 -- ల‌య‌న్స్ గేట్ ప్లే ఓటీటీలో ఎక్కువ‌గా హాలీవుడ్ సినిమాలే రిలీజ్ అవుతుంటాయి. ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కొన్నాళ్లుగా తెలుగు సినిమాల‌పై ఫోక‌స్ పెట్టింది. శుక్ర‌వారం ఒకే రోజు ల‌య‌న్స్ గేట్ ప్లే ఓటీటీలో ఏకంగా ఏడు టాలీవుడ్ మూవీస్‌ రిలీజ‌య్యాయి. అన్నీ థ్రిల్ల‌ర్ సినిమాలే కావ‌డం. ఆ సినిమాలు ఏవంటే?

కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టించిన స‌త్య‌భామ మూవీ ఇప్ప‌టికే ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు స‌న్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ ల‌యన్స్ గేట్ ప్లే ఓటీటీలోకి వ‌చ్చింది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలోన‌వీన్ చంద్ర‌, ప్ర‌జ్వ‌ల్ యాద్మా కీల‌క పాత్ర‌లు పోషించారు.

సుమ‌న్ చిక్కాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించింది. హ‌సీనా అనే గృహిణి హ‌త్య‌కు గురువుతుంది. ఆ హ‌త్య కేసు మి...