భారతదేశం, మార్చి 20 -- టాలీవుడ్‍లో ఇటీవల కొన్ని పాటల్లోని డ్యాన్స్ స్టెప్‍లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. డాకు మహరాజ్ సినిమాలోని దిబిడి దబిడి పాటలో డాన్స్ మూవ్‍మెంట్లపై అసంతృప్తి వ్యక్తమైంది. తాజాగా రాబిన్‍హుడ్ చిత్రంలో 'అదిదా సర్‌ప్రైజ్' అంటూ లిరికల్ వీడియో రాగా.. ఇందులో కేతిక శర్మ చేసిన డ్యాన్స్ స్టెప్‍లపై కొందరు విమర్శలు చేశారు. అసభ్యంగా స్టెప్స్ ఉన్నాయంటూ ఆగ్రహించారు. ఈ విషయంపై నేడు (మార్చి 20) తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. టాలీవుడ్‍కు వార్నింగ్ ఇచ్చింది.

ఇటీవల కొన్ని సినిమా పాటల్లోని డ్యాన్స్ స్టెప్‍లు అసభ్యంగా ఉన్నాయంటూ తమకు ఫిర్యాదులు వచ్చాయని మహిళా కమిషన్ వెల్లడించింది. శక్తివంతమైన మాధ్యమైన సినిమాల్లో మహిళలను కించరిచేలా, అసభ్యంగా చూపించడం సరికాదని పేర్కొంది. కొరియోగ్రాఫర్లు, దర్శకులు, నిర్మాతలు ఈ విషయంపై బాధ్యతగా ఉండాల...