భారతదేశం, మార్చి 7 -- Tollywood: ఇది వ‌ర‌కు హీరోయిన్లు అంటే కేవ‌లం గ్లామ‌ర్‌, పాట‌ల‌కు ప‌రిమితం అనే అపోహ ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. క‌థానాయిక‌ల క్రేజ్‌, ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని క‌థ‌లు రాస్తున్నారు. హీరోయిన్ల‌ను ప‌వ‌ర్‌ఫుల్‌గా చూపిస్తున్నారు. కొన్ని సినిమాల్లో హీరోల‌ను డామినేట్ చేసేలా హీరోయిన్ల క్యారెక్ట‌ర్లు ఉంటున్నాయి. హీరోయిన్ క్యారెక్ట‌ర్స్ స్ఫూర్తిదాయ‌కంగా చూపించిన ఆ సినిమాలు ఏవంటే?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రీతూ వ‌ర్మ కాంబోలో త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పెళ్లిచూపులు మూవీ తెలుగులో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఇండిపెండెంట్‌గా బ‌త‌కాల‌ని ఆలోచించే స్ట్రాంగ్ అమ్మాయిగా రీతూ వ‌ర్మ క్యారెక్ట‌ర్‌ను రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. ఎవ‌రిపై ఆధార‌ప‌డ‌కుండా స్వేచ్ఛ స్వాతంత్య్రాల‌తో బ‌త‌కాల‌ని నేటిత‌రం అమ్మాయిలు ఎలా ఆలో...