భారతదేశం, మార్చి 20 -- బెట్టింగ్ యాప్‍ల ప్రమోషన్ల దుమారం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సాగుతోంది. ఇప్పటికే చాలా మంది యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి. అరెస్టులు జరిగాయి. తాజాగా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల సెగ టాలీవుడ్‍కు తగిలింది. స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, రానాతో పాటు మరికొందరు టాలీవుడ్ సెలెబ్రిటీలపై కేసులు నమోదైనట్టు సమాచారం బయటికి వచ్చింది. బెట్టింగ్ యాప్‍లను ప్రమోట్ చేసినందుకు వీరిపై కేసులు ఫైల్ అయ్యాయి.

బెట్టింగ్ యాప్‍ల ప్రమోషన్ల వ్యవహారంలో సుమారు 25 మంది తెలుగు ఇండస్ట్రీ సెలెబ్రిటీలపై హైదరాబాద్‍లో మియాపూర్ పోలీసులు కేసులు బుక్ చేసిట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్ సహా మరికొందరిపై కేసు నమోదైంది.

హీరోయిన్లు నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, ప్రణీత కూడా ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. యాంకర్ శ్ర...