భారతదేశం, మార్చి 26 -- ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద మొత్తం నాలుగు సినిమాలు పోటీప‌డుతోన్నాయి. అందులో రెండు తెలుగు స్ట్రెయిట్ మూవీస్ కాగా...మ‌రో రెండు డ‌బ్బింగ్ సినిమాలు. నితిన్ రాబిన్‌హుడ్‌తో పాటు నార్నే నితిన్‌, సంగీత్ శోభ‌న్ హీరోలుగా న‌టించిన మ్యాడ్ 2 మ‌ధ్యే ఎక్కువ‌గా పోటీ నెల‌కొంది. ఈ రెండు సినిమాల‌తో పాటు మ‌ల‌యాళ డ‌బ్బింగ్ మూవీ లూసిఫ‌ర్ 2తో పాటు త‌మిళ మూవీ దూన వీర శూర‌న్ పార్ట్ 2 కూడా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి.

హిట్టు కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తోన్న నితిన్ రాబిన్‌హుడ్‌పై బోలెడు ఆశ‌లు పెట్టుకున్నాడు. బీష్మ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత నితిన్‌, డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల కాంబోలో ఈ మూవీ రాబోతుంది. యాక్ష‌న్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చే...