భారతదేశం, మార్చి 11 -- ద‌స‌రా మూవీ ఫేమ్ డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెల ప్రొడ్యూస‌ర్‌గా మారుతోన్నారు.గోదావ‌రిఖ‌ని సిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రేమ‌క‌థా చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్నారు. ఈ మూవీకి అల్ అమీనా జ‌రియా రుక్సానా గులాబీ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల క‌థ‌ను అందిస్తున్నారు. అంతే కాకుండా అనురాగ్ రెడ్డి, శ‌ర‌త్ చంద్ర‌ల‌తో క‌లిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నారు. సినిమా ప్రొడ‌క్ష‌న్ కోసం స‌మ్మ‌క్క సార‌క్క క్రియేష‌న్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థ‌ను మొద‌లుపెట్టారు శ్రీకాంత్ ఓదెల‌. ఈ బ్యాన‌ర్ మీద‌నే గులాబీ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నారు.

ఈ గులాబీ మూవీతో చేత‌న్ బండి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇటీవ‌ల ఈ మూవీ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో నల్లటి చీరలో ఒక అమ్మాయి సరిహద్దు వెంట నడుస్తోండ‌టం క‌నిపిస్తోంది. దారిలో ఎ...