భారతదేశం, ఫిబ్రవరి 21 -- Tollywood: ఆర్టిస్టుల ముఖాల‌ను స్క్రీన్‌పై చూపించకుండా సినిమా చేయ‌డం అంటే సాహ‌స‌మ‌నే చెప్పాలి. అలాంటి అరుదైన ప్ర‌యోగంతో తెలుగులో రా రాజా పేరుతో ఓ మూవీ రాబోతుంది. ఈ సినిమాకు బి. శివ ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రా రాజా రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ రిలీజ్ చేశారు. మార్చి 7న రా రాజా మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఈ సంద‌ర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. 'ఈ మూవీలో ఒక్క ముఖం కూడా కనిపించదు. అసలు ముఖాలు చూపించకుండా సినిమా తీసి దర్శకుడు శివ ప్రసాద్ ధైర్యం చేశాడు. డ్యూయెల్ అని స్పీల్ బర్గ్ తీసిన చిత్రంలోనూ ముఖం కనిపించదు. రా రాజా క‌థ విన‌గానే స్పీల్‌బ‌ర్గ్ మూవీ గుర్తొచ్చింది. అలానే ఈ చిత్రంలోనూ మొహాలు కనిపించవని అంటున్నారు.

ఇది చాలా వైవిధ్య‌మైన‌ ప్రయోగం. ఇది కనుక సక్సెస్ అ...