భారతదేశం, జనవరి 29 -- Tollywood: ర‌ణం సినిమాతో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు కొరియోగ్రాఫ‌ర్ అమ్మ రాజ‌శేఖ‌ర్‌. కొంత గ్యాప్ త‌ర్వాత అమ్మ రాజ‌శేఖ‌ర్ మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్టాడు. త‌ల పేరుతో ఓ మూవీని తెర‌కెక్కిస్తోన్నాడు. ఈ సినిమా ద్వారా అమ్మ రాజ‌శేఖ‌ర్ త‌న‌యుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. త‌ల మూవీ ట్రైల‌ర్‌ బిగ్‌బాస్ సోహెల్‌, హీరో అశ్విన్ రిలీజ్ చేశారు.

ఈ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో బిగ్‌బాస్ సోహెల్ మాట్లాడుతూ అమ్మ రాజశేఖర్ నాకు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ నుంచి తెలుసు. తరువాత బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా క‌లిసి కొన్నాళ్లు జ‌ర్నీ చేశాం. రణం సినిమా తర్వాత ఈ మూవీ అమ్మ రాజ‌శేఖ‌ర్‌కు మంచి క‌మ్‌బ్యాక్ అనిపిస్తోంది. రాగిన్ ఇండ‌స్ట్రీకి నెక్ట్స్ ధనుష్ అవుతాడు అని అన్నాడు. త‌క్కువ బ‌డ్జెట్‌లో మంచి క్యాలిటీతో , కంటెంట్‌తో ...