భారతదేశం, మార్చి 7 -- Today OTT Releases: శుక్ర‌వారం ఒక్క రోజు ఓటీటీలో 20 సినిమాలు రిలీజ‌య్యాయి. మ‌ల‌యాళంతో పాటు త‌మిళం, హిందీలో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన ప‌లు సినిమాలు ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చాయి. నాలుగు తెలుగు సినిమాలు కూడా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. ఆ సినిమాలు ఏవంటే?

నాగ‌చైత‌న్య, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ తండేల్ శుక్ర‌వారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్ల‌లో వంద కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మూవీ స‌రిగ్గా నెల రోజుల‌కు ఓటీటీలోకి వ‌చ్చింది. దేశ‌భ‌క్తికి ల‌వ్‌స్టోరీని జోడించి తెర‌కెక్కిన ఈ మూవీకి చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

శ‌ర్వానంద్ మ‌న‌మే మూవీ ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ స...