Hyderabad, ఏప్రిల్ 10 -- OTT Release Movies Today Telugu: ఓటీటీలోకి ఇవాళ ఆరు సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో ఏ సినిమా చూడాలి, అవి ఏ జోనర్‌లో స్పెషల్‌గా ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, స్ట్రీమింగ్ టైమింగ్ వివరాలు వంటి ఇతర విశేషాలపై ఓ లుక్కేద్దాం.

అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జీ20 ఇవాళ నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో జీ20 ఓటీటీ రిలీజ్ అయింది. నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ వంటి మొత్తం 6 భాషల్లో జీ20 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగులో హారర్ కామెడీ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంగా వచ్చిందే టుక్ టుక్. ఏప్రిల్ 26న థియేటర్లలో విడుదలైన టుక్ టుక్ 15 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ 10 నుంచి ఈటీవీ విన్‌లో టుక్ టుక్ ఓటీటీ స్ట్రీమిం...