Hyderabad, ఏప్రిల్ 3 -- Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరేజే 4 డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అయితే, వీటిలో రెండు సినిమాలు, రెండు వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. అది కూడా ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ జోనర్ అయిన హారర్ యాక్షన్, కామెడీ డ్రామా, కోర్ట్ రూమ్ డ్రామా, మెడికల్ థ్రిల్లర్స్‌గా ఉన్నాయి. తెలుగులో ఒక్కటి మాత్రమే ఓటీటీ రిలీజ్ అయింది. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

2024 నవంబర్ 1న అమెరికా థియేటర్లలో విడుదలైన హాలీవుడ్ కామెడీ డ్రామా సినిమా ఏ రియల్ పెయిన్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. జెస్సీ ఐసన్ బర్గ్ ప్రధాన పాత్రతోపాటు దర్శకత్వం వహించాడు. అతనితోపాటు కీరాన్ కుల్కిన్ ప్రధాన పాత్రలో నటించాడు. అలాగే, జెన్నిఫర్ గ్రే, విష్ షార్ప్, ఎల్లోరా ట్రోషియా ఇతర కీలక పాత్రలు పోషించారు.

3 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో ...