Hyderabad, మార్చి 10 -- Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే రెండు తెలుగు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అవి కూడా రెండు డిఫరెంట్ జోనర్స్‌తో ఉన్న మూవీస్. వాటిలో ఒకటే తల మూవీ. స్టార్ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ కుమారుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అయిన సినిమానే తల.

దీపా ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాణంలో యాక్షన్ డ్రామాగా తల సినిమా రూపొందింది. తల మూవీకి అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించడం విశేషం. ఇక తల మూవీలో అమ్మ రాగిన్ రాజ్‌కు జోడీగా అంకిత నస్కర్ హీరోయిన్‌గా చేసింది. అలాగే, తల చిత్రంలో వీరితోపాటు హీరో రోహిత్, హీరోయిన్ ఎస్తేర్ నొరోన్హా, జబర్దస్త్ అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన తల సినిమాకు ధర్మతేజ సం...