Hyderabad, ఏప్రిల్ 13 -- Today OTT Movies Release Telugu: ఓటీటలోకి ఇవాళ మూడు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో రెండు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే, మరొకటి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటీ, వాటి జోనర్స్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

కోలీవుడ్‌లో పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరొందిన జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన మరో సినిమానే కింగ్‌స్టన్. మొట్టమొదటి తమిళ సీ అడ్వెంచర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీగా కింగ్‌స్టన్ తెరకెక్కింది. ఈ సినిమాకు కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించారు. హీరోగా చేసిన ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

అలాగే, కింగ్‌స్టన్ మూవీలో జీవి ప్రకాష్ కుమార్‌కు జోడీగా గ్లామర్ బ్యూటీ దివ్య భారతి హీరోయిన్‌గా నటించింది. ఓ గ్రామానికి ఉన్న శాపం, సముద్రంలో దొంగతన...