భారతదేశం, జనవరి 25 -- ఓటీటీలోకి ప్రతివారం డిఫరెంట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు దర్శనం ఇస్తూనే ఉంటాయి. ఎక్కువగా హారర్, క్రైమ్, కామెడీ, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్‌ను ఓటీటీ ఆడియెన్స్ ఇష్టపడుతుంటారు. అయితే, నిజ జీవిత సంఘటనల నుంచి వచ్చే సినమాలు చాలా అరుదు.

అలాంటిది తాజాగా రియల్ ఇన్సిడెంట్స్ నుంచి స్ఫూర్తి తీసుకుని సృష్టించిన ఓ పాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ఓటీటీలోకి ఇవాళ (జనవరి 25) వచ్చేసింది. ఆ సినిమానే గొల్ల రామవ్వ. తెలుగు జాతి గర్వపడేలా చేసిన భారత మాజీ ప్రధాని, భారతరత్న అవార్డ్ గ్రహిత స్వర్గీయ పీవీ నరసింహారావు రాసిన కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

పీవీ నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాట గాథకు దృశ్య రూపంగా నిలిచిన గొల్ల రామవ్వ పాత్రతో ఈ మూవీని రూపొందించారు. రజాకార్‌ల ఆక్రమణలను, హింస, దౌర్జన్యాన్ని ఎదుర్కొన్న వీర వనితగా గొల్ల రామవ్...