భారతదేశం, జనవరి 30 -- మలయాళ సినిమాలకు తెలుగులోకూ మంచి క్రేజ్ ఉంటుంది. అక్కడి థ్రిల్లర్లు, హారర్ థ్రిల్లర్లు, ఫీల్ గుడ్ మూవీస్ ను తెలుగు ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తుంటారు. ఓటీటీలు వచ్చాక మలయాళ సినిమాలను తెలుగు ఆడియన్స్ ఎక్కువగా చూస్తున్నారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మరో మలయాళ మూవీ 'సర్వం మాయ' ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (జనవరి 30) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

మలయాళ హీరో నివిన్ పౌలీ లీడ్ రోల్ ప్లే చేసిన హారర్ కామెడీ మూవీ 'సర్వం మాయ'. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలనం క్రియేట్ చేసింది ఈ సినిమా. ఈ సర్వం మాయ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి జియోహాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది.

మలయాళ సినిమా సర్వం మాయ సినిమా ఓటీటీలో ఏకంగా ఏడు భాషల్లో అందుబాటులో ఉంది. జియోహాట్‌స్టార్‌ లో నేటి నుంచి మలయాళంతో ప...