Hyderabad, మార్చి 16 -- జీవితంలో జరిగే మాయాజాలం ఏంటంటే కష్టాలు, సవాళ్లు మళ్లీ మళ్లీ వస్తుంటాయి. సంతోషాలు కూడా చెప్పాపెట్టకుండానే వచ్చి ఆశ్చర్యపడతాయి. పరిస్థితి ఏదైనా దాని నుంచి మనం తప్పక ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవాలి. వాటికి తగ్గట్లుగా మనల్ని మనం మార్చుకొని లోకం ముందు నిలబడాలి. ముఖ్యంగా కష్టాలు, సవాళ్లు ఎదురైనప్పుడు ఏమీ చేయలేకపోతున్నాను అని తలపట్టుకుని కూర్చోకూండా. వాటిని ఎలా పరిష్కారించాలో ఆలోచించాలి.

వాస్తవానికి సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడటం పరిష్కారం దిశగా అడుగులు వేయడం అందరికీ సాధ్యమయే పని కాదు. చాలా మందికి అది అసాధ్యంగా అనిపించచ్చు. కానీ తలచుకుంటే దీన్ని సుసాధ్యం చేయచ్చు. ప్రతి సమస్య నుంచి చక్కటి పాఠాన్ని నేర్చుకోవచ్చు. వాటిని భవిష్యత్తు కోసం మార్గాలుగా మలుచుకోవచ్చు. ఇందుకోసం మీరు కొన్ని విషయాలను అలవాటుగా మార్చుకోవాల్సి ఉంటుంద...