Hyderabad, మార్చి 29 -- మన కంటికి చాలా విషయాలు కపడతాయి. కానీ అందులో అన్నీ నిజాలు ఉండవు. వాస్తవానికి అక్కడ జరిగింది వేరే అయి ఉంటుంది.. కానీ కంటికి కనిపించిన దాన్ని మనం వేరేలా అర్థం చేసుకోవచ్చు. ఈ కథ వింటే ఇది నిజమే అని మీకు కూడా అనిపిస్తుంది.

ఓ 24 ఏళ్ల వ్యక్తి ట్రైయిన్ విండోలో నుంచి బయటకు చూస్తూ ఆనందంతో ఉప్పొంగిపోతుంటాడు. "నాన్న అటు చూడు, చెట్లు వెనక్కి వెళ్లిపోతున్నాయి" అని కొడుకంటుంటే, నాన్న నవ్వుకుంటూ పక్కన వాళ్లను చూసి తలదించుకుంటాడు. అయితే, కొడుకు మరోసారి ఇలా.. "నాన్న చూడు, మేఘాలు మనతో పాటే పరిగెడుతున్నాయి" అంటాడు.

మళ్లీ వాళ్ల నాన్న నవ్వుకుంటుంటే.. ఈ సారి పక్కనే ఉన్న ఒక యంగ్ కపుల్ సహనం కోల్పోయి, "మీ వాడికి పిచ్చి ముదిరిందనుకుంటా. అలా చూస్తూ నవ్వుకుంటూ కూర్చోకపోతే ఏదైనా హాస్పిటల్‌లో చూపించొచ్చు కదా" అంటారు.

ఆ మాట విని ప్రశాంతంగా చూస...