భారతదేశం, ఫిబ్రవరి 17 -- Tirupati Temple Expo : దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజంది ప్రత్యేక పాత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ వినియోగంతో మరింత ముందుకెళ్లాలన్నారు. దేవాలయాల నిర్వహణలో సాంకేతికతను వినియోగించాలని సూచించారు. ఆధ్యాత్మికత వైపు అందరూ అడుగులు వేస్తున్నారని, ఎందరో భక్తులు రూ.కోట్ల విరాళాలు ఇస్తున్నారన్నారు. ఆ విరాళాలను పేదల శ్రేయస్సు కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. తిరుపతిలో ప్రారంభమైన అంతర్జాతీయ ఆలయ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పోస్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

"ప్రతి రాష్ట్ర హెడ్ క్వార్టర్ లో, ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలి. ఎక్కడ తెలుగు వారు అంటే, ఆయా దేశాల్లో కూడా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలి. ఈ దిశగా టీటీడీ పని చేసి, దేవాలయాలు నిర్మిస్తుంది. పీ-4 విధానంలో దేశంలో మౌలిక వసతులు మరింత పెరగాలి. దేవుడి సేవ మాత్రమే ...