భారతదేశం, ఏప్రిల్ 4 -- Tirupati Palani Bus: తిరుపతి నుంచి తమిళనాడులోని పళనిలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కోసం బస్సు సర్వీసు ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ చొరవతో ఈ బస్సును ప్రారంభించారు. రెండు అధ్యాత్మిక క్షేత్రాల మధ్య నేరుగా రవాణా సదుపాయం లేకపోవడంతో డైరెక్ట్ బస్సు ఏర్పాటు చేయాలని భక్తులు విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన పవన్ కళ్యాణ్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడంతో కొత్త సర్వీసు ప్రారంభమైంది.

గురువారం బస్సు సర్వీసును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలిసి ప్రారంభించారు. గతంలో షష్ట షణ్ముఖ యాత్ర సందర్భంగా పళనిలో భక్తులకు ఇచ్చిన హామీని నెరవేర్చినట్టు పవన్ కళ్యాణ్ వివరించారు.

తిరుపతి-పళని ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్...