భారతదేశం, ఏప్రిల్ 9 -- Tirupati Pakala Katpadi Project : ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో తిరుపతి-పాకాల-కాట్పాడి సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ (104 కి.మీ) డబ్లింగ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.1332 కోట్లుగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టుతో ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుందని, లాజిస్టిక్ ఖర్చును తగ్గిస్తుందని కేంద్రం తెలిపింది. దీంతో చమురు దిగుమతులను తగ్గించడంతో పాటు, తక్కువ CO2 ఉద్గారాలకు దోహదం చేస్తుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టు స్థిరమైన, సమర్థవంతమైన రైల్వే కార్యకలాపాలకు మద్దతు ఇస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్ట్ సుమారు 400 గ్రామాలకు, సుమారు 14 లక్షల జనాభాకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇవాళ దిల్లీలో కేంద్ర కేబినెట్ భేట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.