భారతదేశం, ఫిబ్రవరి 4 -- Tirupati Deputy Mayor : తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. డిప్యూటీ మేయర్ గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు 26 మంది, వైసీపీ అభ్యర్థి భాస్కర్‌రెడ్డికి 21 మంది మద్దతు తెలిపారు. దీంతో మునికృష్ణ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సోమవారమే డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరగాల్సి ఉండగా, తగిన కోరం లేకపోవడంతో ఎన్నిక ఇవాళ్టికి వాయిదా పడింది.

తిరుపతి మున్సిపాలిటీలో మొత్తం 50 మంది కార్పొరేటర్ల స్థానాలకు గాను ప్రస్తుతం 47 మంది ఉన్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, వైసీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం నగరపాలక సంస్థలో ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. మొత్తంగా 50 మంది సభ్యులకు సగం మంది అంటే 25 మంది హాజరు అవ్వాల్సి ఉండగా, న...