భారతదేశం, ఫిబ్రవరి 6 -- తిరుప‌తి జిల్లాలో నారాయ‌ణ‌వ‌నం మండ‌లంలోని ఒక పాఠ‌శాల‌లో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి జరిగింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పిచ్చాటూరు మండ‌లం కీల‌పూడికి చెందిన టి.వెంక‌ట‌ర‌మ‌ణ.. నారాయ‌ణ‌వ‌నం మండ‌లంలోని ఒక గ్రామంలో ప్రాథ‌మికోన్న‌త పాఠ‌శాల‌లో ఉపాధ్యాయుడిగా ప‌ని చేస్తున్నాడు. స‌మీప గ్రామంలోని ప్రాథ‌మిక పాఠ‌శాల ఉపాధ్యాయురాలు విజ‌య‌శాంతి వృత్తిప‌ర‌మైన శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌కు వెళ్లారు. దీంతో మండ‌ల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) ఆదేశాల మేర‌కు ఈ పాఠ‌శాల‌కు వెంక‌ట‌ర‌మ‌ణ డిప్యూటేష‌న్‌పై విధులు నిర్వ‌హించడానికి వెళ్లారు.

మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం భోజ‌న విరామ స‌మ‌యంలో.. న‌లుగురు విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు వెంక‌ట‌ర‌మ‌ణ అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. సాయంత్రం స్కూల్ అయిపోయిన త‌రువాత‌ ఇంటికి వెళ్లిన చిన్నారులు.. ఉపాధ్యాయుడు త‌మ ప‌ట్ల ...