భారతదేశం, ఏప్రిల్ 12 -- తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (16).. సమీపంలోని హరిజనవాడకు చెందిన యువకుడిని ప్రేమించింది. ఈ క్రమంలో కుమార్తె గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న తల్లి అబార్షన్‌ చేయించింది. ఆ యువకుడికి దూరంగా ఉండాలని కుమార్తెను హెచ్చరించింది. అయినా వారు మళ్లీ కలిసి తిరగారు. దీంతో బాలికను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

యువకుడిపై పోలీసులు పోక్సో కేసు పెట్టి చిత్తూరు జైలుకు పంపారు. ఆ సమయంలోనూ బాలిక రెండుసార్లు జైలుకు వెళ్లి యువకుడిని కలిసింది. ఈ నేపథ్యంలోనే యువకుడు జైలు నుంచి విడుదలయ్యాడు. మళ్లీ వారి మధ్య సంబంధం కొనసాగింది. జైలు నుంచి బయటకు వచ్చిన యువకుడితో కుమార్తె కలిసి తిరుగుతోందని తల్లి గుర్తించింది. బాలికకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించింది.

బాలిక బంధువులు అతనితో వెళ్లవద్దని ఒప్పించే ప్ర...