భారతదేశం, జనవరి 27 -- Tirupati Crime: తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను ప్రియుడి సాయంతో హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. మృతుడి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. నిందితుల‌ను అదుపులోకి తీసుకుని విచార‌ణ జ‌రుపుతున్నారు. త‌న అక్ర‌మ సంబంధానికి అడ్డుగా ఉన్నాడ‌నే, ఆమె ఆ ఘాతుకానికి పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌కలం సృష్టించింది.

ఈ దారుణ ఘ‌ట‌న తిరుప‌తి జిల్లా పిచ్చాటూరు మండ‌లం కీళ్ల‌పూడి పంచాయ‌తీ గ‌జ‌సింగ‌రాజ‌పురం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం గ‌జ‌సింగ‌రాజ‌పురం గ్రామంలో ఆంటోని (34), సుగంధి (30) దంప‌తులు ఉన్నారు. వీరికి ఇద్ద‌రు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సుగంధికి త‌న స్వ‌గ్రామ‌మైన చిత్తూరు జిల్లా నిండ్ర మండ‌లంలోని ఇరుగువాయికి చెందిన అరుల్ రా...