భారతదేశం, ఫిబ్రవరి 10 -- Tirupati : తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ మోసం చేశాడంటూ ఆరోపణలు చేసిన మహిళ లక్ష్మీని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి తిలక్ రోడ్డులోని శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద జైపూర్ పోలీసులు లక్ష్మీని అదుపులోకి తీసుకున్నారు. చెక్ బౌన్స్ కేసులో ఆమెను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. కిరణ్ రాయల్ తనను మోసం చేశారని, తనకు ఇవ్వాల్సిన రూ.1.20 కోట్లు ఇవ్వడంలేదని లక్ష్మీ ఇటీవల ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.

అరెస్టుకు ముందు ఆమె తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ...తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. ఎక్కడ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా అండగా ఉంటానన్న పవన్ కల్యాణ్, చంద్రబాబు, జగన్ ను తనకు న్యాయం చేయాలని కోరుతున్నానన్నారు. తాను ఒంటరి పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

కిరణ్ రాయల్ మాయమాటలకు తాను మోసపోయానన్నారు. తన ప...