భారతదేశం, ఫిబ్రవరి 9 -- Tirumala Updates : తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఫిబ్రవరి 12న పౌర్ణమి గరుడసేవ నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ప్రతినెలా పౌర్ణమి రోజున టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రానున్న బుధవారం రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో విహ‌రించి భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి భక్తుల కోసం గరుడ వాహన సేవను ఎస్వీబీసీ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

తిరుమల దివ్య క్షేత్రంలో ఫిబ్రవరి 12న బుధవారం శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి అత్యంత వైభవంగా జరుగనుంది. పురాణాలపరంగా తిరుమలలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయని చెబుతారు. అయితే ఈ పుణ్యతీర్థాలలో, సప్తగిరులలో వెలసి ఉన్న సప్త తీర్థములు ప్రముఖమైనవి. వీటిలో స్వామి పుష్కరిణీ తీర్థము, కూమారధార తీర్థము, తుంబురు తీర...