ఆంధ్రప్రదేశ్,తిరుమల, మార్చి 28 -- తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. వచ్చే ఏప్రిల్ మాసంలో జరిగే విశేష పర్వదినాల వివరాలను తెలిపింది. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి ఆస్థానం ఉంటుందని పేర్కొంది. ఏప్రిల్ 10 నుంచి 12వ తేది వరకు వసంతోత్సవాలు ఉంటాయని ప్రకటించింది. ఇవే కాకుండా మరికొన్ని వేడుకల వివరాలను టీటీడీ వెల్లడించింది.

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఇందుకు సంంబధించిన వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో ఏప్రిల్‌ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ⁠ఏప్రిల్‌ 4, 11, 18, 25వ తేదీల‌లో శుక్ర‌వారం సంద‌ర్భంగా సాయంత్రం 6 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం నిర్వ‌హించ‌నున్నారు. ⁠ ⁠ఏప్రిల్‌ 21న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయం...