తిరుమల,ఆంధ్రప్రదేశ్, జనవరి 31 -- తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో అప్డేట్ ఇచ్చింది. ఫిబ్రవరి మాసంలో జరిగే విశేష పర్వదినాల వివరాలను ప్రకటించింది.ఫిబ్రవరి 2న వసంత పంచమి, ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి వేడుకలు ఉంటాయని పేర్కొంది. ఇక ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి వేడుకలు ఉంటాయని వివరించింది.

రథ సప్తమి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మినీ బ్రహ్మోత్సవం తరహాలో రథసప్తమి వేడుకలు జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు.

రథసప్తమి సందర్భంగా ఆ రోజు అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. బ్రేక్ దర్శనాలకు స...