భారతదేశం, ఏప్రిల్ 12 -- Tirumala Shocking Incident : తిరుమలలో అపచారం చోటుచేసుకుంది. టీటీడీ అధికారుల నిర్లక్ష్యంతో ఇద్దరు భక్తులు పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. టీటీడీ విజిలెన్స్, ఉద్యోగులు పట్టించుకోక పోవడంతో చెప్పులతోనే ఆలయ మహాద్వారం వరకు భక్తులు చేరుకున్నారు. వైకుంఠంలోకి భక్తులు ప్రవేశించే సమయంలో విజిలెన్స్, టీటీడీ ఉద్యోగులు గుర్తించకపోవడం వల్లే ఇలా జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని నిత్యం వేల మంది భక్తులు దర్శించుకుంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుని దర్శనం కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉంటారు. క్షణకాల దర్శనం కోసం గంటల సమయం సామాన్య భక్తులు వేచి ఉంటారు. తిరుమలేశుడి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు తరలివస్తుంటా...