ఆంధ్రప్రదేశ్,తిరుమల, ఫిబ్రవరి 9 -- ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సభ్యులకు ఉండే వీఐపీ బ్రేక్ దర్శన కోటాపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కోటాను రెట్టింపు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌) సభ్యులకు ప్రస్తుతం రోజువారీగా వీఐపీ బ్రేక్ దర్శన కోటా కింద 50 టికెట్లను ఇస్తున్నారు. అయితే ఈ కోటాను 100 పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

టీటీడీ నిర్ణయం ఫలితంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే పలువురు ప్రవాస భారతీయులకు దర్శనం విషయంలో మరికొంత వెసులుబాటు కలగనుంది. ఎన్నారై భక్తుల డిమాండ్ దృష్ట్యా ఈ కోటాను టీటీడీ పెంచింది. ఈ కోటా కింద ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుల్లోనూ వృద్ధులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

Published by HT Digital Content Services with perm...