భారతదేశం, జనవరి 11 -- Tirumala Leopard : తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. అలిపిరి వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తోన్న టీటీడీ ఉద్యోగికి రోడ్డు పక్కన చిరుత కనిపించింది. దీంతో అతడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాధితుడికి తీవ్రగాయాలు అయ్యాయి. అతడిని హుటాహుటిన తిరుపతిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ అధికారులు చిరుత సంచారంపై భక్తులను అలర్ట్ చేశారు.
వేదిక్ యూనివర్సిటీ వద్ద రోడ్డు దాటుతున్న చిరుతను బైక్ వెళ్తోన్న టీటీడీ ఉద్యోగి విజయ్‌కుమార్ చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టగా...అతడికి తీవ్రగాయాలయ్యాయి. విజయ్‌కుమార్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ మార్గంలో వెళ్లే భక్తులు చిరుత సంచారంతో భయపడుతున్నారు. ఈ సమాచారం త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.