భారతదేశం, ఫిబ్రవరి 9 -- Tirumala Laddu Row : తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ చేపట్టింది. సీబీఐ దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నెయ్యి సరఫరా చేసిన నలుగురు వ్యక్తులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. తమిళనాడుకు చెందిన ఏఆర్‌ డెయిరీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన పరాగ్‌ డెయిరీ, ప్రీమియర్‌ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్‌ ఫుడ్స్‌ సంస్థలకు చెందిన పలువురిని గత మూడు రోజులుగా సీబీఐ తిరుపతిలో విచారిస్తోంది.

విచారణకు సహకరించకపోవడం, కల్తీ నెయ్యి ఘటనలో ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో నలుగురిని సీబీఐ ఇవాళ అదుపులోకి తీసుకుంది. అయితే ఈ విషయాన్ని దర్యాప్తు అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగంపై సీబీఐ దర్...