భారతదేశం, ఫిబ్రవరి 10 -- Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో సిట్‌ బృందం విచారణ వేగం చేసింది. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. నిందితుల రిమాండ్‌ రిపోర్టులో సిట్ కీలక అంశాలను ప్రస్తావించింది. నిన్న అరెస్టైన నలుగురిని ఈ కేసులో ఏ-2 నుంచి ఏ-5గా చేర్చారు. అలాగే నెయ్యి సరఫరాదారుల్లో ఒకరిగా ఉన్న వైష్ణవి డెయిరీ సీఈవోను ఏ-8గా పేర్కొన్నారు.

కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి రావడంతో నిందితులు ఆధారాలను చెరిపివేసేందుకు ఫోన్లు ధ్వంసం చేసి కొత్తవి కొన్నారని సిట్‌ వెల్లడించింది. విచారణలో ఫోన్లు పోయాయని తప్పుడు సమాచారం ఇచ్చారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.

ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీలు అక్రమాలకు పాల్పడినట్లు సిట్ తేల్చింది. బోలేబాబా డెయిరీ తమ ఉద్యోగులను అజ్ఞాతంలోకి పంపిందని గుర్తించింది. నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ల...