భారతదేశం, మార్చి 12 -- Tirumala Laddu : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ప్రసాదాల‌కు నెయ్యి సేక‌ర‌ణ రోజు రోజు క‌ష్టంగా మారుతోంది. స‌రిప‌డా నెయ్యి అందుబాటులో లేక‌పోవ‌డంతో ప్రసాదాల త‌యారీలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వ‌స్తోంది. మ‌రోవైపు నెయ్యి కొర‌త‌ను పసిగ‌ట్టిన అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇత‌ర సంస్థల నుంచి నెయ్యి సేక‌ర‌ణ‌కు చ‌ర్యలు తీసుకుంటున్నారు.

తిరుమ‌ల శ్రీ‌వారి ప్రసాదం (లడ్డూ) అంటే ఇష్టప‌డని వారు ఉండ‌రు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ‌వ్యాప్తంగా ఆ మాట‌కొస్తే ప్రపంచ వ్యాప్తంగా శ్రీ‌వారి ప్రసాదానికి ప్రియులు ఉన్నారు. శ్రీ‌వారి ప్రసాదమంటే అమృతంగా భావించిన వారు ఉన్నారు. ఆ ప్రసాదం దొర‌క‌డం కూడా పూర్వ జ‌న్మ శుక్రుతమ‌నుకునేవారు కూడా ఉన్నారు. ప్రపంచ అభిమానులు ఉన్న ఈ శ్రీ‌వారి ప్ర‌సాదం త‌యారీ చేయ‌డానికి కీల‌క‌మైన ప‌దార్థం...