భారతదేశం, జనవరి 24 -- సంచలనం సృష్టించిన తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు పూర్తి అయింది. తుది ఛార్జీషీట్ ను ఫైల్ చేసింది. మరిన్ని కీలక అంశాలను తుది ఛార్డీషీట్ లో ప్రస్తావించింది. ఐదేళ్ల వ్యవధిలో ఏకంగా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని పేర్కొంది. ఛార్జిషీట్‌లో ముందుగా 24 మందిని నిందితులుగా పేర్కొనగా. మరో 12 మంది పాత్ర కూడా ఉన్నట్లు కోర్టుకు నివేదించింది. మొత్తంగా ఈ కేసులో 36 మంది నిందితులు ఉన్నట్లు పేర్కొంది.

ఈ కల్తీ నెయ్యి వ్యవహారంపై 2024 సెప్టెంబర్ 24వ తేదీన సిట్‌ ఏర్పాటు చేశారు. తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ ఏర్పాటై విచారణ కొనసాగింది. దాదాపు 16 నెలలపాటు. 10 రాష్ట్రాల్లో విచారణ జరిగింది.

ఈ కేసులో గతేడాది మేలో సిట్ మొదటి ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా.. తాజాగా తుది ఛార్...