తిరుమల,ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ 6 -- తిరుమల, తిరుపతిలోని శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. స్థానికుల కోటా దర్శనంలో భాగంగా ఇవాళ దర్శన టోకెన్లను జారీ చేస్తోంది. స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని ఓ ప్రకటనలో కోరింది.

తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను టోకెన్లు అందజేస్తారు. ఇక తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుంచే శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు టోకెన్లు తీసుకోవచ్చని టీటీడీ సూచించింది.

ఇవాళ ధ్వజారోహణంతో ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుండి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారో...