భారతదేశం, ఫిబ్రవరి 8 -- Tirumala Darshan Tickets : తిరుపతి స్థానిక భక్తుల కోటా టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 11న స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఈ తేదీ దర్శనం టికెట్లను ఫిబ్రవరి 9న తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో, తిరుమలలోని బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో జారీ చేస్తారు. ఫిబ్రవరి 4న రథసప్తమిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ స్థానికుల దర్శనాన్ని నెలలో మొదటి మంగళవారం నుంచి ఫిబ్రవరి నెలలో రెండో మంగళవారానికి వారానికి మార్చిన విషయం తెలిసిందే.

తిరుపతి శేషాచల పర్వతమూలంలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవ‌రి 19 నుంచి 28వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఫిబ్రవరి 18న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది. బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా ఫిబ్రవ‌రి 15న ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వహించ‌న...