భారతదేశం, మార్చి 23 -- Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి దర్శనానికి రెండు నెలల ముందుగా టీటీడీ టికెట్లు విడుదల చేస్తున్న సంగతి తెలిసింది. జూన్ నెల కోటాకు సంబంధించి వివిధ సేవలు, దర్శనం, వసతి టికెట్లు మార్చి 18 నుంచి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఆర్జిత సేవల టోకెన్లను విడుదల చేశారు. రేపు(మార్చి 24న) ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు, వసతి గదులు టికెట్లు విడుదల చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నారు.

మార్చి 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో వసతి గదుల కోటాను విడుదల చేయనున్నారు. శ్రీవారి భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ లేదా టీటీడీ దేవస్థానం యాప్ లో దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాల‌న...