ఆంధ్రప్రదేశ్,తిరుమల, ఫిబ్రవరి 24 -- భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇవాళ(ఫిబ్రవరి 24) శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి. మే నెల‌కు సంబంధించిన దర్శనం టికెట్ల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఆన్ లైన్ ద్వారా భక్తులు పొందాల్సి ఉంటుంది.

ఇక తిరుమల, తిరుపతిలో గదుల కోటా టికెట్లపై కూడా టీటీడీ ప్రకటన చేసింది. మే నెల గదుల కోటా టికెట్లను కూడా ఇవాళనే(ఫిబ్రవరి 24) విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

ఇక శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది. ఫేక్ వెబ్ సైట్ లను నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

త...