తిరుమల,ఆంధ్రప్రదేశ్, జనవరి 17 -- తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. సుప్ర‌భాతం, తోమ‌ల‌, అర్చ‌న‌, అష్టదళ పాదపద్మారాధన సేవల ఏప్రిల్‌ నెల కోటాను జ‌న‌వ‌రి 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేష‌న్‌ కోసం జ‌న‌వ‌రి 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జ‌న‌వ‌రి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....