ఆంధ్రప్రదేశ్,తిరుమల, ఫిబ్రవరి 28 -- తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలపై టీటీడీ ప్రకటన చేసింది. మార్చి 9నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య తెప్పోత్సవాలు జరగనున్నాయి. పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

శ్రీవారి ఆలయ పుష్కరిణిలో నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తెప్పోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ముందు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

శ్రీవారి తెప్పోత్సవాల కారణంగా టీటీడీ కీలక ప్రకటన చేసింది. మార్చి...