ఆంధ్రప్రదేశ్,తిరుమల, జనవరి 24 -- రథసప్తమికి సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 4వ తేదీన తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం తరహాలో రథసప్తమి వేడుకలు జరుగుతాయని తెలిపారు.

తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్రవారం అదనపు ఈవో వెంకయ్య చౌదరిలతో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఈవో శ్యామలరావు ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. భక్తులు గ్యాలరీలోకి ప్రవేశం, నిష్క్రమణ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఈవో సూచించారు.

గ్యాలరీలలో ఉండే భక్తులకు సకాలంలో అన్నప్రసాదాలు, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఈవో శ్యామలరావు ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. అనంతరం అధికారులతో కలిసి నాలుగు మాడ వీధుల్లో ఏర్పాట్లను పరిశీలించారు.

రథసప్తమి రోజున ఉదయం నుండి స...