ఆంధ్రప్రదేశ్,తిరుమల, జనవరి 16 -- వైకుంఠ ద్వార దర్శనం ఎస్‌ఎస్‌డి టోకెన్లపై ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో జె.శ్యామలరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు.

తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చివరి రోజు SSD టోకెన్ల జారీ శుక్రవారం (జనవరి 17)తో ముగిసే అవకాశం ఉందని ఈవో శ్యామలరావు తెలిపారు. జనవరి 20న దర్శనం కోరే భక్తులకు జనవరి 19న SSD టోకెన్లు జారీ చేయబడవని స్పష్టం చేశారు. వారు క్యూ లైన్‌లో మాత్రమే శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

జనవరి 19న ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టిక్కెట్లు జారీ చేయబడవని ఈవో పేర్కొన్నారు. అదేవిధంగా జనవరి 20న టీటీడీ ప్రోటోకాల్ భక్తులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ కారణంగా జనవరి 19న వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారు. ఈ ...