ఆంధ్రప్రదేశ్,తిరుమల, ఫిబ్రవరి 1 -- స్థానిక కోటా టికెట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అలర్ట్ ఇచ్చింది. ఈ కోటా దర్శనాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు తెలిపింది. ఈనెల మొదటి మంగళవారమైన 4వ తేది రథసప్తమి పర్వదినం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో మంగళవారమైన 11వ తేదికి స్థానిక కోటా దర్శనాలను మార్పు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్, తిరుపతిలోని మహతీ ఆడిటోరియంలో 9వ తేది ఆదివారం టోకెన్లను జారీ చేస్తారని వెల్లడించింది. స్థానికులు ఈ మార్పును గమనించి టోకెన్లు పొందాలని విజ్ఞప్తి చేసింది. ప్రతినెలా మొదటి మంగళవారం తిరుమల, తిరుపతి స్థానికులకు టీటీడీ స్థానిక కోటాలో దర్శనాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 4వ తేది రథసప్తమి(సూర్య జయంతి) సందర్భంగా తిరుమలలో వ...