భారతదేశం, ఫిబ్రవరి 15 -- Tirumala : తిరుమల శ్రీవారి భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. కలియుగ దైవాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు అలిపిరి కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. అయితే గత కొంత కాలంగా కాలినడక మార్గంలో చిరుతల సంచారంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. చిరుత సంచారాన్ని గుర్తించిన టీడీటీ, ఫారెస్ట్ అధికారులు నడక మార్గంలో వెళ్లే భక్తులకు కీలక సూచనలు చేశారు. చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ అధికారులు పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

అలిపిరి నుంచి నడక మార్గంలో శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులను గుంపులు, గుంపులుగా పంపుతున్నారు. టీటీడీ అధికారులు సూచనల మేరకు భక్తులను గంపులుగా పంపుతున్నట్లు సిబ్బంది తెలిపారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు యథావిధిగా అనుమతి...