తిరుమల,ఆంధ్రప్రదేశ్, డిసెంబర్ 28 -- తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో అప్డేట్ ఇచ్చింది. శ్రీవారికి ఏడాది పూర్తి నిర్వహించే 450 పై చిలుకు ఉత్సవాలలో 25 రోజుల పాటు నిర్వహించే అత్యంత సుదీర్ఘమైన అధ్యయనోత్సవాలపై ప్రకటన చేసింది. ఈ ఏడాది డిసెంబరు 30 నుంచి తిరుమలలో ఘనంగా జరపనున్నట్లు తెలిపింది.

2025 జ‌న‌వ‌రి 23వ తేదీ వరకు తిరుమల ఆలయంలో అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ పేర్కొంది. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ పాసుర పారాయణంగా పిలిచే ఈ అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 2025 జనవరి 10 నుంచి వైకుంఠ ఏకాదశి ద్వార ద‌ర్శ‌నాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 19వ తేదీ వరకు ఈ దర్శనాలు ఉంటాయని టీటీడీ తెలిపింది. వైకుంఠ ఏకాదశి ద్వార ద‌ర్శ‌నాలు ప్...