తిరుమల,ఆంధ్రప్రదేశ్, మార్చి 19 -- తిరుమల శ్రీవారి ఆలయంలో 30వ తేదీన ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి టీటీడీ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఉగాది ఆస్థానం వేళ. శ్రీవారి ఆలయంలో మార్చి 25వ తేదీన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

కోయిల్ ఆల్వార్ తిరుమంజనం వేళ మంగళవారం శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. అంతేకాకుండా మార్చి 30 ఆదివారం నాడు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని. సహస్ర దీపాలంకార సేవ మినహా అన్ని ఆర్జిత సేవలను రద్దు అయ్యాయి.

మార్చి 25, 30 తేదీల్లో ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయి. ఈ కారణంగా మార్చి 24వ తారీఖున, అదే విధంగా మార్చి 29న వీఐపీ బ్రేక్ దర్శనాలకి సంబంధించి ఎటువంటి సిఫార్సు లేఖలను స్వీకరించడం జరగదని టీటీడీ ...