భారతదేశం, మార్చి 10 -- స్లీపింగ్ డిజార్డర్ అనేది ప్రెజెంట్ జనరేషన్ లో కామన్ అయిపోయింది. కళ్లు మూసుకున్న చాలా సేపటికి గానీ, నిద్రపట్టడం లేదని కొన్ని వేల మంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. చక్కగా నిద్రపోకపోతే శరీరం మరుసటి రోజుకు రిఫ్రెష్ అవదు. నిద్రలో క్వాలిటీ లేకపోతే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. కేవలం శరీరానికే కాదు, చర్మానికి, మానసిక ఆరోగ్యానికి కూడా సరిపడ నిద్ర అవసరం. అర్ధరాత్రి వరకూ ఎదురుచూస్తూ గుడ్లగూబ కళ్లతో తిప్పలు పడాల్సిన అవసరం లేకుండా, ఈ టిప్స్ మిమ్మల్ని వెంటనే నిద్రపోయేలా చేస్తాయి.

చక్కటి నిద్ర పట్టాలంటే, రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. వీకెండ్స్ సమయంలో, ప్రత్యేక సందర్భాల్లో కూడా మీ నిద్రసమయాన్ని మార్చుకోకపోవడం బెటర్.

ఎనర్జీ డ్రింక్స్‌లో, కాఫీ, టీలలో కూడా కెఫైన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి సాయంత్రం వేళల్లో తీసుకోవడం వ...