Hyderabad, మార్చి 14 -- హోలీ పండుగ దాదాపు అందరికీ ప్రియమైనది. పిల్లలు మాత్రమే కాదు, పెద్దలు కూడా ఈ పండుగను ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజు ప్రజలు ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడం, అంతా కలిసి ఆటలు ఆడటం, పాటలు పాడటం ఇవన్నీచూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఎరుపు, గులాబీ, ఆకుపచ్చ రంగుల వర్షం కురుస్తున్నట్లు అనిపిస్తుంది.

హోలీ ఆడటంలో చాలా ఆనందం ఉంటుంది. కానీ ఈ రంగులను శుభ్రం చేయడంలో మాత్రమే అందరికీ చెమటలు పట్టడం మొదలవుతుంది. శరీరానికి అంటుకున్న రంగులు 3-4 రోజుల్లో పోతాయి. కానీ గోడల మీద అంటుకున్న రంగులను తొలగించడమే చాలా కష్టతరమైన పని. ఎందుకంటే గోడల మీద అంటుకున్న రంగులను అంత సులభంగా తొలగిపోవు. ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. మీ ఇంట్లో గోడలు కూడా హోలీ రంగులతో నిండిపోయి ఉంటే, వాటిని శుభ్రం చేయడమే మీ ప్రస్తుత లక్ష్యమైతే ఈ చిట్కాలు...