Hyderabad, ఫిబ్రవరి 17 -- పిల్లల నుంచి పెద్దలు వరకూ దాదాపు అందరూ పనీర్‌ను ఇష్టపడతారు. ముఖ్యంగా రోజూ తినే రొటీన్ ఆహార పదార్థాలు బోర్ కొట్టినప్పుడు, ప్రత్యేకంగా ఏదైనా తినాలనిపించినప్పుడు పనీర్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని రుచిలో అలాంటి ప్రత్యేకత ఉంటుంది. రుచిలో మాత్రమే కాదు ప్రొటీన్లకు కూడా చక్కటి మూలం పనీర్. శాఖాహారులకు ఇది చక్కటి ప్రోటీన్ ఫుడ్.

అందుకే చాలా మంది ఆహార ప్రియులతో పాటు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించే వారు కూడా పనీర్‌ను ఎప్పుడూ తమ డైట్లో ఏదో ఒక రూపంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే.. పనీర్ ను ఎక్కువ కాలం నిల్వ చేయడం కష్టం. ముఖ్యంగా ఫ్రిజ్ లేకుండా పనీర్ త్వరగా ఎండిపోతుంది, పాడైపోయి దుర్వాసన వస్తుంది. కొన్నిసార్లు ఫ్రిజ్ లో ఉంచినప్పటికీ కైడా తాజాగా, మృదువుగా అనిపించదు. పైగా రుచిలో, రంగులో కూడా తేడాలు ఏర్పడతాయి...